తెలంగాణలో CSIRలో రిక్రూట్‌మెంట్! 19 d ago
CSIR-I ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) సైంటిస్టు పోస్టులు 31 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్ధుల విద్యార్హత ME/M.Tech/Ph.D కలిగి ఉండాలి. గరిష్ట వయో పరిమితి 32 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేర వయో పరిమితి సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యూడి/మహిళలు/CSIR ఉద్యోగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్ధులకు ఫీజు లేదు. మిగిలిన అన్ని ఇతర కేటగిరీ అభ్యర్ధులకి ఫీజు రూ. 100/-. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 9 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి వివరాలకు https://www.iict.res.in/ ఇక్కడ క్లిక్ చేయండి.